Saturday, 8 April 2017

About Eeyluvam Tamilnadu

ఆయన లేడు... బుద్ధుడున్నాడు!

శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు తెచ్చుకొన్నారు. హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.



ఆరేళ్ల చిరుత ప్రాయంలోనే ఉలిని చేతబట్టి అలవోకగా చెక్కు తున్న గణపతిని చూచి, ఎప్పటికైనా దేశం గర్వించదగ్గ శిల్పి అవుతాడనుకున్న తమిళనాడులోని రామనాథపురం జిల్లా, ఎలువం కోటై శిల్పుల ఊహల్ని నిజం చేశారు పద్మశ్రీ ఎస్‌.ఎం. గణపతి స్థపతి. 1931, ఏప్రిల్‌ 26న ముత్తు స్థపతి, గౌరీ అమ్మన్‌లకు పుట్టిన గణపతి, సాంప్రదాయ ఆలయ, వాస్తు, శిల్ప శాస్ర్తాలను, కుటుంబ పెద్దల దగ్గర 17 సంవత్సరాల పాటు శిక్షణ పొందారు. శిల్పాలు చెక్కడంలోనూ, ఆలయాలను నిర్మించటంలోనూ కొత్త ఒరవడిని సృష్టించి, ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న గణపతి 1964లోనే అప్పటి మంత్రివర్యులు కల్లూరి చంద్రమౌళి దృష్టిని ఆకర్షించారు. అంతే, తమిళనాడు వదిలి, తెలుగునాట కాలుమోపారు. శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో పేరుతెచ్చుకొన్న గణపతి స్థపతి నైపుణ్యం గురించి, ఆనోటా, ఈనోటా విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, బద్రీనాధ్‌ దేవాలయ మహామండప పని అప్పగించారు. మండప భాగాలను హైదరాబాద్‌లో తీర్చిదిద్ది, బద్రీనాధ్‌కు తరలించి నిర్మించిన తీరుకు అచ్చెరువొందిన ఆమె, ఒక బంగారు గొలుసు, 60 తులాల డాలర్‌ను బహూకరించి సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పిలుపునందుకొని, తిరుమలలో వసంతరాయ మంటపాన్ని పునర్నిర్మించి, ఆస్థాన స్థపతి పదవిని దక్కించుకొన్నారు.



దేవాదాయ, ధర్మాదాయ శాఖలో స్థపతిగా చేరిన గణపతి స్థపతి, ఉమ్మడి రాష్ట్రంలో వందల, వేల ఆలయాలను నిర్మించి, చీఫ్‌ స్థపతిగా ఎదిగారు. శిల్పుల గౌరవాన్ని ఇనుమడింపజేశారు. తరతరాల వాస్తుశిల్ప సంప్రదాయం, నిరంతరం కొనసాగాలన్న తపనతో, తన ఆధ్వర్యంలో దేవాదాయ శాఖలో ఒక శిల్ప కళాశాలను స్థాపించి, కొన్ని వందల మంది శిల్పుల్ని తయారుచేసి, కొరతను తీర్చారు.



రాష్ట్రవ్యాప్తంగా, శిథిలాలయాలను పదిలం చేస్తూ, లేనిచోట కొత్త వాటిని కడుతూ తలమునకలై ఉన్న గణపతి స్థపతికి శ్రీశైలం జలాశయ నీటి ముంపు దేవాలయాల తరలింపు ఒక సవాలుగా మారింది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని 102 గ్రామాల్లో ముంపునకు గురైన దాదాపు 108 దేవాలయాలను ఊడదీసి ఎగువన పునర్నిర్మించిన ఘనతను దక్కించుకొన్నారు. 1978–89 మధ్య చేపట్టిన ఈ చారిత్రక కార్యక్రమంలో ఏ.వేలు, ఈమని శివనాగిరెడ్డి, సుందరరాజన్‌, పి.సుబ్రమణి లాంటి శ్రీమువస్థపతులకు స్వయంగా తర్ఫీదునిచ్చిన ఘనత కూడా గణపతి స్థపతి గారిదే.



వాస్తు, శిల్ప విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి పూనుకుని, తమిళ, సంస్కృత భాషల్లోనున్న వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాలను తెలుగులోకి అనువదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెదపాటి నాగేశ్వరరావు సహకారంతో రూపధ్యాన రత్నావళి, కాశ్యప శిల్ప శాస్ర్తాలను వెలువరించారు. నిరంతర అధ్యయనంతో పాటు, పరిశోధనలపై దృష్టి సారించిన గణపతి స్థపతి, తెలుగు విశ్వవిద్యాలయం, సచివాలయం భవనాల్లో ఆధునికతకు, సాంప్రదాయ వాస్తును జోడించి, కొత్త ఒరవడిని సృష్టించారు.



ఒకసారి అమెరికా వెళ్లిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుకు, న్యూయార్క్‌లో గణపతి స్థపతి తారసపడగా, లిబర్టీ స్టాట్యూ లాంటి విలక్షణ విగ్రహాన్ని హైదరాబాద్‌లో సృష్టించలేమా అన్న ప్రశ్నకు సమాధానంగా, హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం కోసం యాదగిరిగుట్టకు సమీపంలోని రాయగిరి నుంచి 100అడుగుల రాయిని, 100 చక్రాల వాహనంపై హైదరాబాద్‌కు తరలించి, ప్రపంచ ఖ్యాతిని గడించారు గణపతి స్థపతి. తెలుగు నేలపైనే కాక విదేశాల్లో సైతం ఆలయాలను నిర్మించి, తెలుగు శిల్పుల కీర్తిని దశదిశలా చాటటంలో భాగంగా, పిట్స్‌బర్గ్‌లోని బాలాజీ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అమెరికా తిరుపతిగా ప్రసిద్ధి చెంది, రోజూ వేల మంది భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.



ప్రచారం కోరుకోని నిరాడంబర జీవితం గడిపిన గణపతి స్థపతి శిల్పకళా చాతుర్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, 1990లో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీనిచ్చి గౌరవించింది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా, శిల్పకళానిధి, కళైమామణి, శిల్పకళా రత్న వంటి బిరుదులెన్ని వరించినా, సాధారణ శిల్పుల గౌరవాన్ని పొందటమే మిన్న అని నమ్మారు.



వందలాది దేవుళ్లకు వేలాది ఆలయాలను నిర్మించిన గణపతి స్థపతి స్వర్ణభైరవారాధకుడు. అయినా, కంచి కామకోటి పీఠ పరంపరలోని 68వ శంకరాచార్యులైన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామికి పరమభక్తుడు. ఆయన ఆకాంక్ష మేరకు, కంచి సమీపంలోనున్న ఒరుక్కై గ్రామంలో అనల్ప శిల్పకల్పనా చాతుర్యంతో మలచిన 100 స్థంభాలతో నిర్మించిన మణి మంటప నిర్మాణం, తన చిరకాల వాంఛగా తరచూ పేర్కొనేవారు గణపతి స్థపతి. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. శంకరాచార్య స్వామి ఆశీస్సులతో అక్కడే శంకర శిల్పశాలను స్థాపించి, వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తూ కడశ్వాస విడిచారు.



ఉలి చప్పుళ్ల మధ్య కళ్లు తెరిచి, ఉలి చప్పుళ్ల మధ్యే కళ్లుమూసిన పద్మశ్రీ గణపతి స్థపతి, ఏప్రిల్‌ 7న, దేవశిల్పి విశ్వకర్మ పిలుపుపై తిరిగిరాని లోకాలకెళ్లారు. ఈ మహాశిల్పి లేకున్నా, ఆయన సృష్టించిన శిల్పాలు, నిర్మించిన ఆలయాలు, ప్రతినిత్యం, తెలుగు శిల్పుల్ని, స్ఫూర్తిమంతం చేస్తూ, కాంతులీనుతూనే ఉంటాయి. ఆయన లేడు. హుస్సేన్‌ సాగర్‌లో బుద్ధుడున్నాడు. భద్రాచలంలో మహా మండపం ఉంది.

ఈమని శివనాగిరెడ్డి - స్థపతి

సీఈవో, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ & అమరావతి

Wednesday, 29 March 2017

About Goa

🌴 Goa 🌴 Goa 🌴 Goa 🌴

Non-Goans think Goa is known only for Beaches and Bottles.

Do you know...?

1. That it is the only state in India, having two official state languages Konkani and Marathi.

2. That Goa is the smallest state of India having a national highway road span of only 120 kms N to S and around 80 kms E to W.

3. Goa’s official language Konkani is the only Indian language that is written in two scripts, Devnagri and Roman English script.

4. Goa is the only state where the state road transport is named after an age old dynasty called Kadamba.

5. That Goa is the second state after Orissa where the world famous Olive Ridley Turtles come to lay their eggs on Morjim beach.

6. It is the only Indian state with an active and enforced Uniform Civil Code implemented by the Portuguese.

7. If you are a Goan, and if  you want, you can avail of Portuguese Nationality Passport.

8. The first printing press of Asia was installed in Goa at St.Paul’s college in 1556.

9. The first medical school of India was established in Goa set up in 1842 at Panaji, demolished in 2004.

10. That Goa is exporting 60% of India’s Mineral Ore to Japan.(which has been stopped recently due to political issues).

11. That Goa is the first state in India to permanently host the International Film Festival.

12. That Goa is the only place where one can hire a two wheeler-taxi called “pilots”.

13. That Goa’s only airport is
military airport of the Navy.

14. That the one and only one Naval Aviation Museum of Asia is located at Vasco in Goa.

15. That India has only two temples dedicated to the Brahma of the Hindu Trinity. One is in Rajasthan and other in Goa. 17.7.kms from Valpoi in the village of Carambolim Brahma temple.

16. Mumbai owes its daily bread to Goa more precisely, to migrant bakers from Saligao and Siolim who brought with them the blessed Pao to Mumbai.

17. Goa, even though is the smallest state in India has the highest bank saving deposit.

18. That Asia’s only floating casino is launched in Goa’s coastal waters at Panaji harbour known as “Caravela”.

19. That India’s largest laterite stone carving of St. Mirabai is at ancestral Goa at Loutolim village.

20.That Goa is the only state of India having the highest forest density cover of 33% of total land mass.

21. The first English medium high school in Goa was established in 1896 at St. Joseph’s high school, Arpora.

22. Goa is the first state in India wherein one can register car, bike or other vehicle online from the dealers directly which started since June 2006, and one need not go to R.T.O. office for registration.

And most amazing part is that petrol is cheaper than diesel in Goa with highest per capita income after Chandigarh and 2nd in literacy rate!

 *Viva Goa*

Saturday, 4 March 2017

Popular websites


Temples : 
    Education : 
    Central Govt. : 
    Columnists :  
    Medicine :

    Monday, 13 February 2017

    Mangaloru Puttur loni Lakshmi Narayana Swamy Temple...

    Dearest Friends Brothers and Sisters,



    Good morning to you all శుభోదయం. ఇది కర్ణాటక కేరళ బోర్డర్ లో  మంగళూరు, దగ్గర పుత్తూర్ లోన లక్ష్మీ నారాయణస్వామి గుడి  Mangaloru Puttur loni Lakshmi Narayana Swamy Temple. అందరికీ మంచి జరగాలనీ మనసావాచా కోరుకుంటూ -
    డా. గౌతమ్ కశ్యప్

    Friday, 10 February 2017

    Kasi ...Varanasi...

    ్ర, దర్శించు పుణ్య క్షేత్రాలు*

    *కాశీ*
    కాశీ లేదా వారాణాసి

    భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.

    ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.

    ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం.

    వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రాన్ని వారాణాసి అంటారు.

    బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది.

    కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది"- అని హిందువులు విశ్వసిస్తారు.

    ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది.

    బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం.

    వారాణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది.

    గంగానది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ మరియు సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి.

    హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, కబీర్ దాస్, శంకరాచార్యుడు, మున్షీ ప్రేమ్ చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు.

    వారణాసికి గంగానది ఆవలి వైపున రామనగరం ఉంది.

    వారాణసి సమీపంలో సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది.

    విశ్వేశ్వర మందిరం, అన్నపూర్ణ మందిరం, విశాలాక్షి మందిరం, వారాహీమాత మందిరం, తులసీ మానస మందిరం, సంకట మోచన మందిరం, కాల భైరవ నందిరం, దుర్గా మాత మందిరం, భారతమాత మందిరం - ఇలా కాశీలో ఎన్నో మందిరాలున్నాయి.

    దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి.

    కాశీ హిందూ విశ్వ విద్యాలయం (బనారస్ హిందూ యూనివర్సిటీ) ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది.

    వారాణాసిని "మందిరాల నగరం", "ధేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో ప్రస్తావిస్తుంటారు.

    అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయం కంటే పురాతనమైనది. గాధలకంటే ముందుంది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి.

    "వారాణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్గా మారింది. వారాణాసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

    చరిత్ర::
    షుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాధల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంధాలలో కాశీ నగరం ప్రసక్తి ఉన్నది.

    వారాణాసి నగరం షుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వాని వ్యాపారానికి వారాణాసి కేంద్రంగా ఉంటూ వచ్చింది.

    గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని.

    చైనా యాత్రికుడు యువాన్ చువాంగ్ ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.

    18వ శతాబ్దంలో వారాణాసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది.

    1910లో "రామ్ నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణాసి నగరం పైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివశిస్తున్నాడు.

    భౌగోళికం::
    వారాణాసి నగరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణాసి జిల్లాకు కేంద్రం కూడాను.

    వారాణాసి నగం, దాని పరిసర ప్రాంతాలు కలిపి మొత్తం 112.26 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఈ నగరం నేల ప్రాంతం గంగానది వరదలతో సారవంతంగా ఉంటుంది.

    వారాణాసి నగరం మాత్రం గంగ, వరుణ నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71 మీటర్ల ఎత్తులో ఉంది. పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.

    వారాణాసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది.
    1)గంగ, వరుణ నదుల సంగమం
    2)గంగ, అస్సి నదుల సంగమం.

    అస్సి నది చాలా చిన్నది (కాలువ వంటిది). ఈ రెండు సంగమాల మధ్య దూరం షుమారు 2.5 కిలోమీటర్లు.

    ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర "పంచ క్రోశి యాత్ర" గా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.

    వారాణాసి వాతావరణం తేమగా ఉన్న సమోష్ణ వాతావరణం. వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది.

    ఏప్రిల్-అక్టోబర్ మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతంనుండి వచ్చే చలి తెరగలు కారణంగా డిసెంబరు - ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32-46 °C మధ్య, చలికాలంలో 5°-15 °C మధ్య ఉంటాయి. సగటు వర్షపాతం 1110 మిల్లీమీటర్లు. చలికాలంలో దట్టమైన పొగ మంచు, వేసవి కాలంలో వడ గాడ్పులు ఉంటాయి.

    సంస్కృతి::
    వారాణాసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణాసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత, , హిందూ-ముస్లిమ్ సహ జీవనం (మరియు మత కలహాలు కూడా), హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు.

    గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివశిస్తున్నారు.

    గంగానది::
    గంగానదికి, వారాణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది.

    ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది ఒడ్డున ఉన్నాయి.

    గంగానదిలో స్నానం కాశీ యాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

    స్నాన ఘట్టాలు::
    వారాణసిలో షుమారు 100 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్" మరియు "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్లు స్నానానికి మరియు దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్లు పురాణ గాధలతో ముడివడి ఉన్నాయి.

    దశాశ్వమేధ ఘాట్::
    కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకం దారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫొటోలు తీసికొనేవారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాధ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు.

    మణి కర్ణికా ఘాట్::
    మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాధ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. మరొక కధ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశదిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కధనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడిని కొని, హరిశ్చంద్ర ఘాట్లో కాటి పనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి.

    సిండియా ఘాట్::
    150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కధనం. మగ సంతానం కావాలని కోరే వారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సిండియా ఘాట్ కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.

    మన్ మందిర్ ఘాట్::
    1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్ ను, దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు.

    అంబర్ రాజు మాన్సింగ్ మానస-సరోవర్ ఘాట్ ను, దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్ ను నిర్మింపజేశారు.

    లలితా ఘాట్::
    ఇది నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశు పతేశ్వరస్వామి విగ్రహం ఉంది.

    అస్సీ ఘాట్::
    ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్లకు చివర ఉంది.
    ఇంకా తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు.

    పవిత్ర క్షేత్రం::
    వారాణాసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షమంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం, దైవ దర్శనం చేసుకొంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని
    శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.

    బౌద్ధులకు కూడా వారాణాసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు బోధించాడు. వారాణాసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధనను ఉపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకునికంటె ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థలంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.

    జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుని జన్మ స్థలం అయినందున వారాణాసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.

    వారాణసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకొని ఉంది. హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలు, లేదా ఘర్షణ వాతావరణం అప్పుడప్పుడూ సంభవింఛాయి.

    ఆలయాలు::
    వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి.

    విశ్వనాధ మందిరం::
    కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు" , "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు.

    ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు.

    1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యం లోని ఒక ట్రస్టుకు అప్పగించింది.
    ఈ మందిరం అధికారిక వెబ్సైటు కాశీ విశ్వనాధ 2007 జూలై 23న ప్రాంభమైంది. ఈ వెబ్సైటులో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది.

    మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి

    దుర్గా మందిరం::
    "కోతుల గుడి" గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత "నగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

    సంకట మోచన్ హనుమాన్ మందిరం
    కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు బాంబులు పేల్చారు.

    తులసీ మానస మందిరం::
    ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది.

    బిర్లా మందిరం
    కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది.

    ముఖ్య శివ లింగాలు::
    వారాణీసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు::

    • విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద

    • మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్

    • ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్

    • కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్

    • త్రిపరమేశ్వరుడు - దుర్గా కుండ్

    • కాల మాధవుడు - కథ్ కీ హవేలీ

    • ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్

    • అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్

    • ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్

    • ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్

    • పరమేశ్వరుడు - శంక్తా ఘాట్

    • హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ

    • వశిష్టేశ్వరుడు - శంక్తా జీ

    • కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్

    • నీల కంఠేశ్వరుడు - నీల కంఠా

    • ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా

    • కాశేశ్వరుడు - త్రిలోచన్

    • శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్

    • శుక్రేశ్వరుడు - కాళికా గలీ

    కళ, సాహిత్యం::
    అనాదిగా వారాణాసి నగరం సాహిత్యానికి, పాండిత్యానికి, కళలకు నిలయంగా ఉంది. కబీర్ , తులసీదాస్ , రవిదాస్ , కుల్లూకభట్టు (15వ శతాబ్దంలో మను వ్యాఖ్య రచయిత)వంటి పురాతన రచయితలు, భారతేందు హరిశ్చంద్ర ప్రసాద్, జయశంకర్ ప్రసాద్, ఆచార్య రామచంద్ర శుక్లా, మున్షీ ప్రేమ్ చంద్, జగన్నాధ ప్రసాద్ రత్నాకర్, దేవకీ నందన్ ఖత్రీ, తేఘ్ ఆలీ, క్షేత్రేశ చంద్ర ఛటోపాధ్యాయ, బలదేవ్ ఉపాధ్యాయ, వాగీశ్ శాస్త్రి, విద్యా నివాస్ మిత్రా, కాశీనాథ్ సింగ్, నమ్వార్ సింగ్, రుద్ర కాశికేయ, నిర్గుణ వంటి ఆధునిక రచయితలు వారాణాసికి చెందినవారు. శుశ్రుత సంహితం వ్రాసిన ఆయుర్వేద శస్త్ర చికిత్సానిపుణుడు శుశ్రుతుడు వారాణాసికి చెందినవాడే.
    రాజ కిషోర్ దాస్ (కళా శోధకుడు), ఆనంద కృష్ణ (చరిత్ర కారుడు) మరియు ఓంకార్ ఠాకుర్ పండిట్ రవిశంకర్ , బిస్మిల్లా ఖాన్ , గిరిజాదేవి, సిద్ధేశ్వరీ దేవి, డా. లాల్ మణి మిశ్రా, డా. గోపాల శంకర్ మిశ్రా, డా. ఎన్.రాజన్, డా. రాజభాను సింగ్, పండిట్ సమతా ప్రసాద్, కంథే మహరాజ్, పండిట్ ఎమ్.కల్వంత్, సితారా దేవి, గోపీకృష్ణ, పండిట్ కిషన్ మహరాజ్, రాజన్-సాజన్ మిశ్రా (అన్నదమ్ములు), మహాదేవ మిశ్రా వంటి అనేక సంగీతకారులు వారాణాసి నుండి ప్రఖ్యాతులయ్యారు.
    వారాణాసిలో ఉత్తర హిందూస్తానంలో జరుపుకొనే పండుగలన్నింటినీ ఘనంగా జరుపుకొంటారు.

    ఆర్ధికం
    వారాణసిలో ఉన్న ఒక పెద్ద పరిశ్రమ రైల్వే డీసెల్ ఇంజన్ల తయారీ కర్మాగారం కాన్పూర్ కు చెందిన నిహాల్ చంద్ కిషోరీ లాల్ కుటుంబం 1857లో స్థాపించిన ఆక్సిజన్ కర్మాగారం ఇక్కడి మొదటి పెద్ద పరిశ్రమ కావచ్చును. కాని అధికంగా వారాణాసిలో చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టు వస్త్రాల నేత ఇక్కడ పెద్ద కుటీర పరిశ్రమ. ఇంకా తివాచీల నేత, చేతి కళల వస్తువుల తయారీ ఉన్నాయి.

    బనారసీ పాన్, బనారసీ కోవా ప్రసిద్ధాలు. లార్డ్ మెకాలే వారాణాసి ఎంతో సంపన్నమైన నగరమని, ఇక్కడ తయారయ్యే నాణ్యమైన సన్నని పట్టు వస్త్రాలు ప్రపంచంలో వివిధ సంపన్న గృహాలను అలంకరిస్తున్నాయని వ్రాశాడు.

    మొదటినుండి యాత్రా స్థలం అవ్వడం వలన, వారాణాసి దేశం అన్ని ప్రాంతాలనుండి జనులను ఆకర్షించేది. కనుక ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.

    రవాణా::
    తరతరాలుగా వారాణాసి ప్రధాన ప్రయాణ మార్గంలోని నగరంగా ఉంది. చారిత్రికంగా ఇది తక్షశిల, ఘాజీపూర్, పాటలీపుత్రం (పాట్నా), వైశాలి, అయోధ్య, గోరఖ్ పూర్, ఆగ్రా వంటి నగరాలకు కూడలిగా ఉంది.

    మౌర్యుల కాలంలో తక్షశిల నుండి పాటలీపుత్ర నగరానికి వెళ్ళే దారిలో వారాణాసి ఉంది. దీనిని 16వ శతాబ్దంలో షేర్ షా సూరి తిరిగి వేయించాడు.

    ప్రస్తుతం వారాణాసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాలనుండి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలుపబడింది. ఇది రెండవ నంబరు ఢిల్లీ కొలకత్తా జాతీయ రహదారిపై ఢిల్లీ నుండి 800 కిలోమీటర్లు కొలకత్తా నుండి 700 కిలోమీటర్లు దూరంలో ఉన్న పట్టణం. బాబత్పూర్ విమానాశ్రయం నగరం నడిబొడ్డునుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొలకత్తా, నేపాల్ లకు విమాన సర్వీసులు ఉన్నాయి.

    వారాణాసి రైల్వేస్టేషను ఢిల్లీ - కలకత్తా ప్రధాన రైలు మార్గంలో ఉంది. నగరం లోపల సిటీ బస్సులున్నాయి. కాని అత్యధికంగా ప్రైవేటు వాహనాలు, ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరం లోపలి ప్రయాణాలకు వాడుతుంటారు. గంగా నదిని దాటడానికి చిన్న పడవలు, స్టీమర్లు ఉపయోగిస్తారు.

    వారాణాసి ప్రక్కనే గంగానదిపై వంతెన ఉంది. అటువైపు మొగల్ సరాయి రైల్వే జంక్షన్ పట్టణం ఉంది.

    నగరం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్గాలు ఇరుకైనవి. ఇచ్చట నుండి అలహాబాద్ 120 కిలోమీటర్లు దూరంలో ఉంది.

    చాలా మురుగు నగరాల లాగానే, ఇక్కడ తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది.

    "గంగా యాక్షన్ ప్లాన్" పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణాసి ఒకటి.

    విద్య::
    వారాణాసిలో మూడు సార్వత్రిక విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో కాశీ హిందూ విశ్వ విద్యాలయం లేదా బెనారస్ హిందూ యూనివర్సిటీ అన్నింటికన్నా పెద్దది. 1916లో పండిట్ మదనమోహన మాలవ్యాచే స్థాపింపబడిన ఈ విశ్వ విద్యాలయంలో 128 ప్రత్యేక విభాగాలున్నాయి. ఇది ముందుగా అన్నీబిసెంట్ చే ప్రారంభింపబడిన హిందూ విద్యార్ధుల పాఠశాలగా ఉండేది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం 1350 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది.

    తక్కిన రెండు విశ్వ విద్యాలయాలు - మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం. 1791లో లార్డ్ కారన్ వాలిస్ చే ప్రారంభింపబడిన సంస్కృత కాలేజీ క్రమంగా సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయంగా రూపొందింది.
    సారనాథ్ లో ఉన్న "కేంద్రీయ ఉన్నత టిబెటన్ అధ్యయన సంస్థ" (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్)కు కూడా విశ్వ విద్యాలయ హోదా ఉన్నది. క్రీడా రంగంలోను, విజ్ఞాన రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణనిచ్చే "ఉదయ్ ప్రతాప్ కళాశాల" కూడా విశ్వవిద్యాలయ హోదా కలిగి ఉంది.

    ఇంతే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు, సాంప్రదాయిక విద్యా కేంద్రాలున్నాయి. సనాతన కాలంనుండి సంస్కృతం, వేదాంతం, జ్యోతిషం వంటి సంప్రదాయ పాండిత్యానికి వారాణాసి ప్రధాన అధ్యయన కేంద్రంగా ఉంటూ వచ్చింది. దీనిని "సర్వ విద్యా రాజధాని" అంటుండేవారు.నగరంలో జామియా సలాఫియా అనే సలాఫీ ఇస్లామీయ అధ్యయన సంస్థ కూడా ఉన్నది.

    ఇవే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ పాఠశాలలు మరియు కాలేజీలు కూడా ఉన్నాయి.

    పర్యాటక రంగం
    వారణాసిలో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం.

    నగరంలో 3,4, 5 స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమౌతాయి. అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి.

    పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామానుకు వారాణాసి ప్రసిద్ధి చెందినది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు ఆకర్షణీయమైన దీపపు స్థంభాలు మరియు హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభిస్తాయి.

    చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు, లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు

    ఇతరాలు
    ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యాన్ని గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు. "ముల్లోకాలు నాకు నివాసమే. అందులో కాశీ క్షేత్రం నా మందిరం."

    గంగాస్నానము చేయునప్పుడు సబ్బు కాని, షాంపూ కాని వాడరాదు.

    Friday, 27 January 2017

    Eeydu Kondalu తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?

    ‬: తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?

    1. వృషాద్రి
     2. వృషభాద్రి
    3. గరుడాద్రి
     4. అంజనాద్రి
     5. శేషాద్రి
     6. వేంకటాద్రి
    7. నారాయణాద్రి.

    ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ
    ఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన
    ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది.
     ఆ 7కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు,
    పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ
    సామాన్యమైనది కాదు.
    అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
    తీర్థాద్రిః
    శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
    వృషభాద్రి
    ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
    ఆనందాద్రిశ్చ నీలాద్రి
    స్సుమేరుశిఖరాచలః ||
    వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని
    వింశతిః
    ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ
    పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

    1. వృషభాద్రి - అంటే ఎద్దు :
    వ్రుశాభానికి ఋగ్వేదంలో ఒక
    సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ
    శివుడు కూర్చుంటాడు. దానికి 4
    కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత,
    భవిష్యత్, వర్తమాన కాలాలు)
    వాక్కు అంటే - శబ్దం
    శబ్దం అంటే - వేదం
    వేదం అంటే - ప్రమాణము
    వేదమే ప్రమాణము. వేదము యొక్క
    ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి
    కొండ ఎక్కుతాడు.

    2. వృషాద్రి - అంటే ధర్మం :
    ధర్మం అంటే - నువ్వు వేదాన్ని
    అనుసరించి చేయవలసిన పనులు.
    నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి
    వినడం, చూడడం, మంచి
    వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను,
    పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు.
    అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

    3. గరుడాద్రి - అంటే పక్షి -
    ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
    షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క
    పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది.
    పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన
    వాటికి 6 వికారాలు ఉంటాయి.
    పుట్టినది, ఉన్నది, పెరిగినది,
    మార్పు చెందినది, తరిగినది, నశించినది.
    ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే
    ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
    భ == ఐశ్వర్య బలము, వీర్య
    తేజస్సు మరియు అంతా తానే
    బ్రహ్మాండము అయినవాడు.
    అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ
    సహితుడు, హేయగుణ రహితుడు.
    అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత
    తెలుసుకోవడమే గరుడాద్రి.

    4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి
    కాటుక.
    ఈ కంటితో చూడవలసినవి మాత్రమే
    చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో
    అంతటా బ్రహ్మమే ఉందని
    తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా
    పరమాత్మ సృష్టియే.
    అప్పుడు అంజనాద్రి దాటతాడు.

    5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే
    అని చూసాడనుకోండి వాడికి
    రాగద్వేషాలు ఉండవు. వాడికి
    క్రోధం ఉండదు. వాడికి
    శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో
    గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా
    స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)
    తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి
    భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి
    భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా
    ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే
    శేషాద్రిని ఎక్కడం.

    6. వేంకటాద్రి - వేం : పాపం, కట :
    తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా
    బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే
    మనకి
    బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా
    కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ
    పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో
    అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని,
    పిచ్చివాడు ఒకలా ఉంటారు.
    ఆయనకే అర్పణం అనడం, అటువంటి
    స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

    7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థని
    కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా
    నిలబడిపోతాడు. అటువంటి స్థితిని
    పొందడం నారాయణాద్రి.
    వేంకటాచలంలో
    ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత
    నిక్షేపాలను ఉంచారు.

    ఈ కారణాలు తెలుకుకోవడం కుడా ఏడు కొండలు ఎక్కినంత పుణ్యం ..