పశ్చిమగోదావరి జిల్లా,భీమవరంకి 5 కిలోమీటర్ల దూరం లో ఉన్న యనమదుర్రు గ్రామంలో వుంది ఈ మహిమాన్విత దేవాలయం. ఇక్కడ పరమ శివుడు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటుంటే,పార్వతిదేవి కుమారస్వామిని చంటిపిల్లాడిరూపంలో ఒడిలో పడుకోపెట్టుకుని ఒకే పానమట్టం మీద దర్శనం ఇస్తారు. దీనిని శక్తీశ్వరాలయం అంటారు. ఈ ఆలయదర్శనం వల్ల దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి.