Thursday, 20 September 2018

About Ramagiri / kamanpur / peddapalli jilla

"రామగిరి."

"హరిగిరులు" గా పిలవబడే కొండపై "శ్రీరాముడు,సీతా,లక్ష్మణ,ఆంజనేయ సమేతుడై" ఇక్కడ విడిది చేసిన తదుపరి ఇది "రామగిరి" గా మారెను.

ఈ "కోట/ఖిల్లాను కాకతీయులు,గురిజాల  వంశీయులు,ముసునూరి వంశీయులు,బహమనీ సుల్తానులు,నిజాం మొ.లగు రాజులు కేంద్రంగా" పరిపాలించిరి.

కాళిదాసు "మేఘసందేశం" కావ్యమును ఇక్కడే రాసినట్టు,మడికి సింగన కవి తన రచనలు ఇక్కడే చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నవి.

ఈ రామగిరిపై "200 రకములపైన వనమూలికలు ఉన్నాయని" వివిధ పరిశోధనల ద్వారా తెలిసినది.

రామగిరిపై "శివలింగం,సీతమ్మ కొలను,నివాస గదులు,1000 మంది నివసించే గుహ" ఇలా అడుగడుగునా అద్భుతాలే.

అన్నింటికంటే "శ్రావణమాసములో ఈ రామగిరిపై అధ్యాత్మిక వాతావరణాన్ని చూడవలసినదే."

"శ్రీ రామనామముతో గిరులు మారుమ్రోగుతాయి."

కావున ఓ "బేగంపేట,రత్నగిరి గ్రామ,కమాన్ పూర్ మండల, పెద్దపల్లి జిల్లా యువ సింహాల్లారా..."
మీ "రామగిరిని " ప్రపంచ ప్రఖ్యాతి గాంచేట్టు చూడండి.మీ ప్రాభవాన్ని ఆ సీతారామలక్ష్మణులు చూసుకుంటారు.

















Wednesday, 12 September 2018

About Tekulagudem / Telangana State

"భీష్ముడు" తన తండ్రి "శంతనుని ఆదేశం మేరకు" "దండకారణ్యంలో శివుని గురించి తపస్సు చేసి కొన్ని "దివ్యాస్త్రములు పొందిన ప్రదేశం."

అందువలననే అది "భీష్మేశ్వర లింగంగా" ప్రసిధ్ధి చెందింది.

"తెలంగాణ - చత్తీస్ గఢ్ సరిహద్దు" ప్రస్తుత "జయశంకర్ భూపాలపల్లి జిల్లా "టేకులగూడెం గ్రామ శివారులో ఉంది" ఈ "భీష్మ శంకర ఆలయం".

ఈనాటికీ ఇరు రాష్ట్రాల భక్తులచే పూజలందుకుంటున్న "భీష్మేశ్వరుడు" సరిహద్దుగుండా ప్రయాణించే వారికి రక్షణ కల్పిస్తున్నారు.

కావున ఓ "టేకులగూడెం గ్రామ,వాగజేడు మండల,జయశంకర భూపాలపల్లి జిల్లా" యువ సింహాల్లారా...

మీ " భీష్మేశ్వరుని "ప్రపంచానికి పరిచయం చేయండి.వారు మీ ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేస్తారు.